కరోనా కష్టకాలాన్ని అవకాశంగా తీసుకొని నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు ఆస్పత్రులు రుసుములు వసూలు చేస్తే కఠినచర్యలు తప్పవని గుంటూరు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి యాస్మిన్ హెచ్చరించారు. అనుమతులు లేకుండా కొన్ని... అనుమతులున్నా నిబంధనలు ఉల్లంఘించి ఇంకొన్ని ఆసుపత్రులు రోగుల నుంచి అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో... డీఎంహెచ్ఓ యాస్మిన్ స్పందించారు. ఇప్పటికే కొన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకున్నామని.. మరికొన్ని ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చామని తెలిపారు. ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆస్పత్రులు, ఖచ్చితంగా 50 శాతం కొవిడ్ రోగుల కోసం కేటాయించాలని... ఇలా ఎవరైనా చేర్చుకోకపోతే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. గుంటూరు జిల్లాలో కరోనా పాజిటివ్ రేటు తగ్గుతుందని.... ఇది శుభపరిణామమని పేర్కొన్నారు.
ఇవీ చూడండి...