ETV Bharat / state

స్ట్రాంగ్ రూములను పరిశీలించిన జిల్లా కలెక్టర్ - undavalli sridevi latest news

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో పరిషత్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ గురువారం రాత్రి పరిశీలించారు. అక్కడ తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు.

guntur parishad election
గుంటూరు జిల్లాలో పరిషత్ ఎన్నికలు
author img

By

Published : Apr 9, 2021, 8:16 AM IST

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్​లు ఉంచే స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ అధికారులను ఆదేశించారు. నాదెండ్ల మండలం గణపవరంలోని సీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో భద్రపరిచిన ఎన్నికల పోలింగ్ బాక్సులను గురువారం రాత్రి స్ట్రాంగ్ రూములను ఆయన పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లపై తీసుకోవలసిన జాగ్రత్తలను అధికారులకు ఆయన సూచించారు.

సీసీ కెమెరాలు ఏర్పాటుతో పాటు స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించే వరకు ఇది కొనసాగుతుందన్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో పాటు ఎంపీడీవోలు, తహసీల్దార్లు కలెక్టర్ వెంట ఉన్నారు.

చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు..

పరిషత్ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి తాడికొండలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యానికి ఊపిరి పోసే పెద్ద ప్రక్రియలో ఓటు చాల ముఖ్యమైనదని ఆమె అన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాడని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసిన బాబుకు రాజకీయాల్లో కొనసాగే నైతిక అర్హత లేదని విమర్శించారు. భవిష్యత్తులో తెదేపా భూ స్థాపితం అవడం ఖాయమని అన్నారు.

ఇదీ చదవండి: రాళ్లు, సీసాలతో దాడులు చేసుకున్న వైకాపా, తెదేపా వర్గాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.