గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడులో ఎంపీఈవోగా విధులు నిర్వహిస్తున్న దివ్యపై దాడిని వ్యవసాయ సంఘం అధికారులు ఖండించారు. ప్రభుత్వ నియమాలకు లోబడి పనిచేస్తున్న తమపై దాడులు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తోన్న అధికారులు, సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో ఓ అన్నదాత రైతు భరోసా పథకంలో తన కుమార్తె పేరును కూడా నమోదు చేయాలని కోరగా... నిబంధనలకు విరుద్ధంగా నమోదు చేయలేమని ఆమె సమాధానం చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నదాత ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీనిపై ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చూడండి:
అణ్వస్త్రాల కంటే ప్లాస్టికే ప్రమాదకరం: సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం