గుంటూరు జిల్లా అనంతవరం గ్రావెల్ క్వారీలో అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇక్కడ ఎవరికీ ఎలాంటి అనుమతి లేనప్పటికి పట్టపగలే ప్రొక్లెనర్ల సాయంతో ట్రాక్టర్ల ద్వారా గ్రావెల్ ను తరలిస్తున్నారు. రాజధాని పరిసర ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఈ మట్టిని ఒక్కొక్క ట్రాక్టర్ కి 3వేల చొప్పున అమ్మకాలు జరుగుతున్నాయి. గతంలో రాత్రిపూట ఈ తవ్వకాలు జరగ్గా, ప్రస్తుతం పట్టపగలే దోపిడీకి ఒడికడుతున్నారు. రాజధాని ప్రాంతంలోనే ఈ అక్రమ తవ్వకాలు జరుగుతుంటే మైనింగ్ అధికారులు చోద్యం చూస్తున్నారనీ స్థానికులు వాపోతున్నరు. ఇప్పటికైనా ఈ అక్రమాలను అరికట్టాలని కోరుతున్నారు.
ఇదీ చూడండి:'నిఘావర్గాల హెచ్చరికలతో తిరుపతిలో తనిఖీలు విస్తృతం'