తెదేపా గూటికి గౌరు దంపతులు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి దంపతులు తెదేపాలో చేరారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో తెదేపా కండువా వేసుకున్నారు. వారితో పాటే.. పాణ్యం నియోజకవర్గానికి చెందిన వైకాపా కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పార్టీ మారారు. జిల్లాకు తాగు, సాగునీరు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని గౌరు చరిత అన్నారు. పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. పాణ్యాన్ని పారిశ్రామిక హబ్ చేసిన ఘనత చంద్రబాబుదే అని.. నాయకత్వ లక్షణాలు ఎలా ఉంటాయో ఆయన్ను చూసి నేర్చుకోవాలనీ చెప్పారు.
ఇవీ చదవండి...
'దిల్లీలో స్కెచ్చేసి.. రాష్ట్రంలో దొరికిపోయారు''
'కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఇదే'