వర్షాలు, వరదతో దెబ్బతిన్న వరి పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని గుంటూరు జిల్లా గురజాల ఆర్డీవో పార్థసారథి తెలిపారు. దీనికోసం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన... పంట దెబ్బతిన్న రైతులు తొందరపడి ధాన్యాన్ని దళారులకు తక్కువ రేటుకు అమ్ముకోవద్దని సూచించారు.
రైతుకు గిట్టుబాటు అయ్యే విధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాల్లో పంటను కొనుగోలు చేస్తామని చెప్పారు. నాణ్యత గల వరి క్వింటాకు రూ.1878కి చెల్లిస్తామని చెప్పారు. సాధారణ రకం క్వింటాకు రూ.1868కి కొనుగోలు చేస్తామన్నారు.
ఇదీ చదవండి