అన్నా క్యాంటీన్లను మూసివేస్తే తమ పరిస్థితి ఏంటని కార్మికులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చాలీచాలని వేతనాలతో బతుకుతున్నామని గుంటూరులో ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం క్యాంటీన్లను ఈ నెలాఖరుతో మూసివేస్తుందని వస్తున్న ఊహాగానాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇదే జరిగితే.. రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న సుమారు 20 వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డునపడతాయన్నారు. నాలుగు నెలలుగా తమకు వేతనాలనూ చెల్లించటంలేదని... వాటి సంగతేంటని ప్రశ్నిస్తున్నారు.
ఇది కూడా చదవండి