ETV Bharat / state

కెనడా అమ్మాయి అమలాపురం అబ్బాయి ప్రేమ - హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి - CANADA GIRL MARRIAGE AMALAPURAM BOY

ప్రేమ పెళ్లితో ఒక్కటైన కెనడా అమ్మాయి అమలాపురం అబ్బాయి - హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ వారంలో వరుడి స్వగృహంలో వివాహం

canada_girl_marriage_amalapuram_boy
canada_girl_marriage_amalapuram_boy (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 4, 2024, 10:51 PM IST

Canada Girl Love Marriage to Young Man from Konaseema District: ప్రేమకు రంగు, భాష, దేశంతో సంబంధం లేదని నిరూపించింది ఓ జంట. దేశాలతో సంబంధం లేకుంజా ప్రేమించుకున్న ఈ ప్రేమ జంట ప్రస్తుతం పెళ్లితో ఒక్కటయ్యారు. కెనడా అమ్మాయి బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అబ్బాయి ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. వివరాల్లోకి వెళ్తే జిల్లాలోని అమలాపురం మండలం ఈద్రపల్లికి చెందిన మనోజ్ కుమార్ కెనడా దేశస్తులైన ట్రేసి రో చే డాన్​తో ప్రేమలో పడ్డాడు. వీరు 7 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. మనోజ్ కుమార్ ప్రస్తుతం కెనడాలో బ్యాంక్ మేనేజర్​గా పని చేస్తున్నాడు.

మనోజ్​ కుమార్​కి, అతని ప్రేయసికి కెన్యాలో నిశ్చితార్థం జరగగా కెనడా సాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో హిందూ సాంప్రదాయంగా వివాహం చేసుకునేందుకు 2 రోజుల క్రితం ఈదరపల్లిలోని స్వగృహానికి వచ్చారు. పెళ్లి కుమార్తెను చేసే వేడుకతో పాటు హల్దీ వేడుకను ఈద్రపల్లిలో సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ఈ వారంలో మలికిపురం మండలం దిండిలో వివాహం చేసుకుంటామని పెళ్లి కుమారుడు మనోజ్ కుమార్ వెల్లడించారు. ఈ నెల 8న ఈ కొత్త జంట రిసెప్షన్ జరుపుకోనున్నారు. కెనడా దేశస్తులు ఈదరపల్లిలో కనిపించడంతో గ్రామస్థులు ఆసక్తిగా చూశారు.

కెనడా అమ్మాయి అమలాపురం అబ్బాయి ప్రేమ (ETV Bharat)

రెచ్చిపోతున్న వైఎస్సార్సీపీ సోషల్ మీడియా - సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులు

వైఎస్సార్సీపీకి చింత చచ్చినా పులుపు చావలేదు - ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం: పవన్​కల్యాణ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.