రైతు భరోసా పథకం అమలు పర్చడం ఏమోకానీ వారికి ద్రోహం చేస్తున్నారని తెదేపా నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. రైతు భరోసా కింద న్యాయం చేయడానికి బదులు కోతలు పెడుతున్నారని...ఎన్నికలకు ముందు రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నారని ఆయన విమర్శించారు. రైతులకు ప్రతి సంవత్సరం 12,500రూపాయల చొప్పున ఐదేళ్లలో 50వేలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడెందుకు మాటమార్చిందని ఆయన ప్రశ్నించారు.
ఇదీ చదవండి: తన రెండో పెళ్లి అలా జరగాలంట..!