రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2020 ధరలకు అనుగుణంగా డీఏను వెంటనే అమలు చేయాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట సీఐటీయూ కార్యాలయంలో ఎమ్మెల్సీ లక్ష్మణరావు తన తండ్రి పేరుతో ఏర్పాటు చేసిన కె.వి.ఆర్ ట్రస్టు ద్వారా ఆదివారం ప్రైవేట్ ఉపాధ్యాయులకు ఆర్థిక సాయం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన... 11వ వేతన సంఘం సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలన్నారు.
అలాగే సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీని నిలబెట్టుకోవాలన్నారు. కొవిడ్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 1,16,000 మంది ప్రైవేటు ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి 10 వేల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలన్నారు. కృష్ణా, గుంటూరు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల నమోదు ప్రక్రియను పొడిగించాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. మరోవైపు 21 వేల ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి కొత్త డీఎస్సీ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి
సీజేఐ పరిధిలో ఉన్నందున సమ్మతి ఇవ్వలేను: ఏజీ కె.కె.వేణుగోపాల్