గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న ఫార్మాసిస్ట్ సంధ్య.. ఆత్మహత్య చేసుకుంటున్నాని వాట్సప్ స్టేటస్ పెట్టడం కలకలం రేపింది. పీహెచ్సీ వైద్యాధికారి రత్నశ్రీ తనను అవమానిస్తూ ఇబ్బందులకు గురి చేస్తోందని ఆరోపించింది. అందరూ తనను చూసి నవ్వుతున్నారని, మరణించే వరకు ఆమె వదలదు కాబట్టి బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు స్టేటస్ పెట్టుకుంది.
విషయం గమనించిన పీహెచ్సీ సిబ్బంది వెంటనే వాలంటీరుకు సమాచారం ఇచ్చి.. ఆమెను ఇంటికి పంపించి ఆత్మహత్య చేసుకోకుండా కాపాడారు. పని చేయమని చెప్పడం మినహా తానేమీ అనలేదని వైద్యాధికారి రత్నశ్రీ చెబుతున్నారు. ఓపీలో ఇద్దరి పేర్లు మినహా మిగిలినవి ఎందుకు రాయలేదని మాత్రమే అడిగినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక అందిస్తారని ఆమె తెలిపారు.
ఇదీ చదవండి: