లాక్డౌన్ ప్రభావం నుంచి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈ) కాపాడేందుకు సర్కార్ సిద్ధమైంది. ఎంఎస్‌ఎంఈలకు సాయంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో లాక్‌డౌన్‌తో పారిశ్రామిక రంగానికి వచ్చిన కష్టాలపై చర్చించిన సీఎం.... ఎంఎస్‌ఎంఈలకు ఊరట కలిగించేలా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
సమీక్షలో తీసుకున్న నిర్ణయాలివే
- ఎంఎస్ఎంఈలను కాపాడేందుకు ఆర్థిక రక్షణ ప్రణాళిక ప్రకటన
- 2014–15 నుంచి ఎంఎస్‌ఈలకు పెండింగ్‌లో ఉన్న మొత్తం రూ.905 కోట్ల బకాయిలు చెల్లింపు
- ఏప్రిల్, మే, జూన్ నెలల కాలానికి సంబంధించి రూ.188 కోట్ల విద్యుత్ ఛార్జీల మాఫీ
- తక్కువ వడ్డీకి రూ.200 కోట్లు వర్కింగ్ కేపిటల్ అందజేత
వీటితో పాటు మిగిలిన పరిశ్రమలకు ఏప్రిల్, మే, జూన్ నెలల కరెంటు మినిమం డిమాండ్ ఛార్జీల చెల్లింపు వాయిదా వేయాలని సీఎం జగన్ నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు వచ్చాక మరిన్ని చర్యలు తీసుకుంటామని వివరించారు. టెక్స్‌టైల్ సహా ఇతర పరిశ్రమలనూ ఆదుకునేందుకు కసరత్తు చేస్తామని సీఎం హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: