విశాఖ నుంచి చెన్నైకి అక్రమంగా తరలిస్తున్న గంజాయిని గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసులు పట్టుకున్నారు. టాటా సఫారీ కారులో గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు కాజా టోల్ గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా 400 కిలోల గంజాయిని, ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. గంజాయి ఎక్కడ్నుంచి వస్తోంది....ఎక్కడికి వెళ్తోంది....దీని వెనుకున్న సూత్రదారులు ఎవరనే కోణంలో విచారణ చేస్తున్నారు.
ఇవీ చూడండి..