గుంటూరు జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో మెుత్తం 83.04 శాతం పోలింగ్ నమోదైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ అనంతరం అధికారులు ఫలితాలు వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
- కోతివానిపాలెం సర్పంచిగా కామేపల్లి పద్మావతి గెలుపు
- హాఫ్‌పేటలో సర్పంచిగా తలమాల యర్రయ్య గెలుపు
- బోలయపాలెం సర్పంచిగా కేసన లక్ష్మి విజయం సాధించారు.
- చుండూరుపల్లిలో సర్పంచిగా గొరిజవోలు వంశీకృష్ణ గెలిచారు.
- వీర్లపాలెం సర్పంచిగా బోళ్ల శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు.
- హనుమాన్‌పాలెం సర్పంచిగా జోగేంద్ర విజయం సాధించారు.
- భరిపూడిలో సర్పంచిగా ఆచంట అమరేశ్ గెలిచారు.
- మర్రిపూడిలో సర్పంచిగా కొణతం అరుణ విజయం సాధించారు.
- పొతుమెరలో సర్పంచిగా కాగితాల హనుమప్రసాద్ గెలిచారు.
- సోమసుందపాలెంలో సర్పంచిగా వక్కా ధనలక్ష్మి విజయం సాధించారు.
- సీతారామపురంలో సర్పంచిగా పద్మావతి గెలిచారు.
- ఆళ్లవారిపాలెం సర్పంచిగా కూరేటి శ్రీనివాసరావు విజయం సాధించారు.
- మూలపాలెం సర్పంచిగా బొలిమెర అనిల్‌కుమార్ గెలిచారు.
- వామనగుంటపాలెం సర్పంచిగా వెలినేని లక్ష్మీ విజయం సాధించారు.
- చావావారిపాలెంలో సర్పంచిగా తలమల ఈరయ్య గెలిచారు.
- మురకొండపాడు సర్పంచిగా చెల్లి వజ్రమ్మ విజయం సాధించారు.
- రాజోలు సర్పంచిగా తాతా వెంకటేశ్వర్లు గెలిచారు.
- హాఫ్‌పేటలో సర్పంచిగా తలమాల యర్రయ్య గెలిచారు.
వింతలు :
- పిడపర్తిపాలెం సర్పంచిగా ఒక ఓటుతో గెలిచిన కరుణ శ్రీ విజయం సాధించారు.
- తోట్లపాలెం సర్పంచిగా 6 ఓట్లతో వీరరాఘవయ్య గెలుపొందారు.
- గార్లపాడు సర్పంచిగా 14 ఓట్లతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేశ్ గెలిచారు.
- చంపాడు పంచాయతిలో కూచిపూడి రత్నకుమారి 51 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
- చావావారిపాలెం సర్పంచి అభ్యర్థి కొరబోయిన జ్యోతికి ఒక్క ఓటు కూడా పోల్ కాలేదు.