ETV Bharat / state

కరోనా పరీక్షలు వెంటనే పూర్తి చేయాలి: నగరపాలక కమిషనర్ - గుంటూరు నగరపాలక కమిషనర్ వార్తలు

గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్స్, ప్రజారోగ్య అధికారులతో నగర కమిషనర్​ చల్లా అనురాధ అత్యవసర సమావేశం నిర్వహించారు. వైరస్ పాజిటివ్ నిర్ధారణ జరిగిన ప్రాంతాల్లో ఆరోజు సాయంత్రానికి ప్రైమరీ కాంటాక్ట్స్​ గుర్తింపు, వెంటనే వైద్య పరీక్షలు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కరోనా పరీక్షలు వెంటనే పూర్తి చేయాలి
కరోనా పరీక్షలు వెంటనే పూర్తి చేయాలి
author img

By

Published : Jun 26, 2020, 10:29 PM IST

కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ జరిగిన ప్రాంతాల్లో ఆ రోజు సాయంత్రానికి ప్రైమరీ కాంటాక్ట్స్​ గుర్తింపు, వెంటనే వైద్య పరీక్షలు పూర్తి చేయాల్సిందేనని గుంటూరు నగర కమిషనర్ చల్లా అనురాధ స్పష్టం చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్స్, ప్రజారోగ్య అధికారులతో ఆమె అత్యవసర సమావేశం నిర్వహించారు. పాజిటివ్ కేసుల ప్రైమరీ కాంటాక్ట్స్ గుర్తింపు, సర్వైలైన్సులో నిర్లక్ష్యంగా వెనుకబాటులో ఉన్న మొదటి 10 మంది హెల్త్ సెక్రటరీలకు షోకాజ్ నోటీసులు ఇవ్వాలని యంహెచ్ఓను ఆదేశించారు. గత రెండు నెలలుగా విధులకు హాజరవ్వని ఇద్దరు వాలంటీర్లను విధులు నుంచి తొలగిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు.

ఇక నుంచి ప్రైమరీ కాంటాక్ట్స్ గుర్తింపులో సచివాలయ మహిళా పోలీసులు, నోడల్ ఆఫీసర్స్ కూడా భాగస్వాములు అవుతారన్నారు. మెడికల్ ఆఫీసర్ ఏయన్​ఎంలు పాజిటివ్ కేసు ప్రైమరీ కాంటాక్ట్స్​ను అధిక ప్రాధాన్యతగా గుర్తించి పనిచేయాలన్నారు. సర్వే వివరాలు ఎప్పటికప్పుడు ఆన్​లైన్ చేయాలని.. యుహెచ్​సీల్లో స్వాబ్​ పరీక్షలు చేయాలన్నారు. హోం క్వారంటైన్​లో ఉండే వారిని ప్రతి రోజు పరిశీలించాలన్నారు. మెడికల్ ఆఫీసర్స్ తమకు కేటాయించిన సచివాలయాల వారీగా ప్రతి రోజు నమోదైన పాజిటివ్ కేసులు, సర్వైలెన్స్ వివరాలను తనకు పంపాలన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.