స్వయం సహాయక సంఘాల్లో ఉన్న మహిళలకు, మెప్మా సిబ్బందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనురాధ అవగాన కల్పించారు. మెప్మా పీడీ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్లతో.. మెప్మా సీఎంఎంలతో సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మెప్మా సిబ్బంది కరోనాపై తమ పరిధిలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. సీఓలు, సీఎంఎంలు సైతం ప్రతి రోజు క్షేత్ర స్థాయిలో విధుల్లో పాల్గొని.. సాయంత్రానికి ఆరోజు జరిగిన పని నివేదిక అందించాలన్నారు.
ఇదీ చదవండి: