సామాజిక, ఆర్థిక, విద్యా రంగాలలో ఎస్సీ, ఎస్టీ వంటి వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతికి అన్ని విభాగాల ఉన్నతాధికారులు కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అదిమూలపు సురేష్ అన్నారు. గుంటూరులోని ఓహోటల్ లో ఏర్పాటు చేసిన గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సామాన్య, మధ్యతరగతి కుటుంబాల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాల పట్ల రాష్ట్ర ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. అవినీతి రహిత పాలన, జవాబుదారీతనం, పారదర్శకతతో కూడిన అభివృద్ధి వైపు సీఎం జగన్ అడుగులు వేస్తున్నారని ఆయన తెలిపారు.
ఇవీ చదవండి