‘గుంటూరు జిల్లా పిట్టలవానిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీకై ఇద్దరు మృతి చెందారు. ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అల్లూరులోని ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాదారు గుడిసెలో షార్ట్ సర్క్యూట్ జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ మంటల వల్ల గ్యాస్ సిలిండర్ అంటుకుని లీక్ అయ్యింది.
మంటలకు లోపల ఉన్నవారు బయటకు రాలేక పోయారు. గుంటూరుకు చెందిన కుమార్ (32),విజయవాడకు చెందిన అనపర్తమ్మ(40) ఇద్దరూ సజీవదహనమయ్యారు. బయట నిద్రిస్తున్న మరికొంతమంది పంచ నుంచి బయటకు దూకడంతో వారికి స్వల్పగాయాలయ్యాయి.
ఇదీ చదవండి: 5,800 ఆవులతో వెళ్తూ మునిగిన నౌక