వినాయక విగ్రహాల్లో ప్రత్యేక ప్రతిమలు వేరయా..అన్నట్లు, ఊరు వాడ వినాయక చవితిని విభిన్నంగా జరుపుకుంటూ ప్రత్యేకతను నిలుపుకుంటున్నారు. ఈ కోవలోకే చెందిన గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని షరాఫ్ బజార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణపతి విగ్రహం వస్తోంది. ఆ విగ్రహాన్ని 12 అడుగుల ఎత్తులో మట్టితో తయారుచేసిన ప్రతిమకు, లక్ష బంగారు రేకులతో తయారు చేసిన గణపతులను అమర్చి, బంగారు గణపతిని రూపొందించారు. చూడటానికి పూర్తిగా బంగారు తాపడంతో చేసినట్లున్న ఈ విగ్రహాన్ని చూసి భక్తులు పరవశించిపోతున్నారు. కలకత్తా, విజయనగరం, తంజావురు ప్రాంతాల నుండి 7గురు శిల్పులు ఈ విగ్రహాన్ని నెలరోజులలో పూర్తి చేశారని..మండప నిర్వాహాకులు చెబుతున్నారు.
ఇదీచూడండి.వినూత్న హంగులతో వినాయక మండపం !