ETV Bharat / state

'అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధుల సేకరణ'

కులమతాలకు అతీతంగా ప్రతీ ఒక్కరు అయోధ్య రామ మందిర నిర్మాణానికి సహకరించాలని శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర సమితి జిల్లా అధ్యక్షుడు డాక్టర్​ సత్యనారాయణ చారి తెలిపారు. ఈ నెల 15 నుంచి 31 వరకు జిల్లాలో నిధులు సేకరిస్తామన్నారు.

ayodhya
'అయోధ్య రామ మందిర నిర్మాణానికి నిధుల సేకరణ'
author img

By

Published : Jan 5, 2021, 8:20 AM IST

అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఇంటింటికి రామ మందిరం పేరుతో.. ఈనెల 15 నుంచి 31 వరకు జిల్లాలో నిధుల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఆర్.ఎస్.ఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు డా. సత్యనారాయణ చారి తెలిపారు. శ్రీ రామ జన్మభూమి తీర్ధ క్షేత్ర సమితి ఆధ్వర్యంలో గుంటూరు అరండల్​పేటలో మీడియా సమావేశం నిర్వహించారు. భారతదేశంలోని ప్రతి పౌరుడు ఈ మందిర నిర్మాణ నిధి సమర్పణకు ముందుకు రావాలన్నారు. హిందువుల మనసులో కొలువుదీరిన రామచంద్ర మహరాజ్ దేవాలయ నిర్మాణానికి కులమతాలకు అతీతంగా నిర్మాణ నిధికి ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.

దేవాలయ నిర్మాణంలో ప్రతీ ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. ఏపీ ప్రాంత సంపర్క ప్రముఖ్ ఓలేటి సత్యనారాయణ, డాక్టర్ కల్లగంటి నాగార్జున, రామజన్మభూమి తీర్థ క్షేత్ర గుంటూరు జిల్లా ప్రముఖ్ చలువాది వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: ఆలయాలపై దాడులకు నిరసనగా చినజీయర్ స్వామి రాష్ట్రవ్యాప్త పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.