తెలంగాణలో మంచిర్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. కుమారుడు, కుమార్తెతో పాటు దంపతులు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. కాసిపేట మండలం మల్కపల్లిలో ఘటన జరిగింది. మృతులు రమేష్, పద్మ, కుమారుడు అక్షయ్(17), కుమార్తె సౌమ్య(19)గా పోలీసులు గుర్తించారు. శవపరీక్షలు నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
ఇవీ చూడండి..: మహమ్మారి.. మళ్లీ పంజా!