ETV Bharat / state

మాచర్లలో నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ - మాచర్ల పాఠశాలల్లో కొవిడ్ పరీక్షలు

పాఠశాలల ప్రారంభానికి ముందు.. గుంటూరు జిల్లా మాచర్ల పరిధిలో 929 మందికి వైరస్ నిర్ధారణ పరీక్షలు పూర్తయ్యాయి. నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. 34 విద్యాలయాల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎంఈవో తెలిపారు.

four students covid positive
పాఠశాలల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్న వైద్యులు
author img

By

Published : Oct 29, 2020, 8:50 PM IST

గుంటూరు జిల్లా మాచర్ల పరిధిలోని పాఠశాలల్లో 929 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. నలుగురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు గుర్తించారు. నవంబర్ 2వ తేదీ నుంచి రాష్ట్రంలో విద్యాలయాలు ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో విద్యార్థులకు నిర్ధారణ పరీక్షలు చేపట్టగా.. విషయం వెలుగులోకి వచ్చింది.

విద్యా, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో.. 34 పాఠశాలల్లోని విద్యార్థులు, ఉపాధ్యాయులకు కొవిడ్ పరీక్షల నిర్వహణ కొనసాగుతోంది. గురువారం నాటికి 15 విద్యాలయాల్లో పరీక్షలు పూర్తి కాగా.. మిగతా వాటిలో చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు 715 మంది ఉపాధ్యాయులు, 214 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించామని అధికారులు తెలిపారు. త్వరితగతిన నిర్ధారణ పరీక్షలు పూర్తి చేయనున్నట్లు ఎంఈవో వెల్లడించారు.

ఇదీ చదవండి: కృష్ణా నదిలో యువకుడు గల్లంతు.. లభించని ఆచూకీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.