కృష్ణాజిల్లా గుడివాడ పట్టణంలో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు రావటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రైలుపేట, సత్యనారాయణ పురం, నైజాం పేటలో రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. అధికారులు ఆ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. జోన్లలో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారి చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్రజలు ఎవ్వరూ బైటకు రావొద్దని అధికారులు సూచించారు.
ఇదీ చూడండి. మన్యంలో ఆఖరి మజిలీకి తప్పని తిప్పలు