రాజధానిగా అమరావతి నే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న దీక్షలు 264 రోజు కొనసాగాయి. అమరావతి లోని 29 గ్రామాల్లోనూ రైతులు మహిళలు నిరసన దీక్షలో పాల్గొన్నారు. వెంకట పాలెం లో మహిళలు గ్రామ దేవతకు పొంగళ్ళు సమర్పించి రాజధాని అమరావతిని కొనసాగించాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణ, గుంటూరు జిల్లాలోని విశ్రాంత ఉద్యోగులు మందడం లో దీక్ష చేస్తున్న మహిళలు, రైతులకు మద్దతు తెలిపారు.
రైతులకు సంఘీభావంగా దీక్షలో పాల్గొని నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మందడం, వెలగపూడి, తుళ్లూరు లోని దీక్షలకు హాజరయ్యారు. వచ్చే విజయదశమి నాటికి అమరావతి పూర్తిస్థాయి రాజధానిగా కొనసాగుతోందనే ప్రకటన వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎంగా జగన్ ప్రమాణం చేసిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని గాలికి వదిలేశారని రైతులు విమర్శించారు.
ఇదీ చదవండి: