ETV Bharat / state

వైకాపా దౌర్జన్యాలకు పాల్పడినా.. తెదేపా జెండా ఎగరవేస్తాం: మాజీ ఎమ్మెల్యే యర్రపతినేని - యరపతినేని శ్రీనివాసరావు తాజా వార్తలు

స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరా వేస్తామని గురజాల మాజీ ఎమ్మెల్యే యర్రపతినేని శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలోని దాచేపల్లి, గురజాలల్లో జరుతున్న నామినేషన్ల ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు(Yarapathineni Srinivasa Rao on local body elections ).

MLA Yarapathineni Srinivasa Rao
మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు
author img

By

Published : Nov 5, 2021, 9:51 PM IST

అధికార వైకాపా.. స్థానిక ఎన్నికలల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని గురజాల మాజీ ఎమ్మెల్యే యర్రపతినేని శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా వైకాపా వర్గీయులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురి చేస్తున్నారని.. ప్రభుత్వ అధికారులు, పోలీసులు.. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం జెండా ఎగరా వేస్తామన్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయంతో మీడియా సమావేశం నిర్వహించారు.

అభివృద్ధి చేశాం. ప్రజా బలముందని చెప్పుకునే వైకాపా ప్రభుత్వం.. స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలను ఎందుకు చేయాల్సివస్తుందో. గురజాల, జంగమహేశ్వరపురంలో తెదేపా అభ్యర్థులకు భద్రత కల్పించి నామినేషన్ వేయించమని హైకోర్టు తీర్పునిచ్చింది. న్యాయస్థానం తీర్పును అమలు చేస్తారా? లేదా కోర్టు ధిక్కారం ఎదుర్కొంటారా? అనే విషయాన్ని అధికారులే నిర్ణయించుకోవాలి. వాలంటరీ వ్యవస్థ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమే. పరిధిని అతిక్రమించి పనిచేసే ఏ అధికారులను ఉపేక్షించం.తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. -యర్రపతినేని శ్రీనివాసరావు, తెదేపా నేత

మీరు చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్దమా ?: ఎమ్మెల్యే మహేష్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ నేతలు అభివృద్ధి పేరు చెప్పుకోవడం తప్ప.. అభివృద్ధి ఎక్కడ చేశారో చూపించాలని గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డి డిమాండ్ చేశారు. 'దాచేపల్లి నడిసెంటర్​ అయినా.. బొడ్రాయి సెంటర్​లో అయినా సరే చర్చకు సిద్దం. తెదేపా నేతలు సిద్ధమా..?' అని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి సవాల్​ విసిరారు. 'తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకుంటున్నామని దుష్ప్రచారం చేస్తున్నారు. ఈ రోజు తెదేపా, జనసేన పార్టీ నుంచి ఎంతమంది నామినేషన్లు వేశారు. మేము నిజంగా అడ్డుకుంటే ఇన్ని నామినేషన్లు వేయగలరా. తెదేపా ఓడిపోతుందని తెలిసే అరిగిపోయిన టేప్​ రికార్డులా చెప్పిందే రిపీట్ చేస్తున్నారు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో గురజాల నియోజక వర్గాన్ని ఏమీ అభివృద్ధి చేశారని ప్రశ్నించారు.

ఇదీ చదవండి..

TDP leaders : 'కుప్పం ప్రత్యేక అధికారి వైకాపా కార్యకర్తగా పనిచేస్తున్నారు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.