తితిదేలో అన్య మతస్తులను ఔట్ సోర్సింగ్ విధానంలో ఇష్టారాజ్యంగా నియమిస్తున్నారని గుంటూరులో మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ఆరోపించారు. ఈ విధంగా నియమితులైన వారు తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో తితిదేపై విమర్శలు చేసిన రమణ దీక్షితులును ఆగమ సలహా మండలిలోకి ఎలా తీసుకున్నారని ప్రశ్నించారు. స్వామివారి ఆలయం గురించి ఇష్టారాజ్యంగా మాట్లాడారని... అప్పటి పాలకమండలి తరఫున ఆయనపై పరువు నష్టం దావా వేశామని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం హిందూ ఆలయాల పవిత్రత దెబ్బ తీయడమే లక్ష్యంగా పని చేస్తోందని ఎద్దేవా చేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ఏసు కీర్తనలు పాడిన విషయం పత్రికల్లో వచ్చాయని తెలిపారు.
ఇదీచూడండి.'పరిశ్రమల ప్రోత్సహకానికి నూతన పాలసీ'