గుంటూరు జిల్లా పెదకాకాని మండలంలోని నంబూరు, గోళ్ళమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో పడి పోయిన వరి పంటను తెదేపా నేత కొల్లు రవీంద్ర పరిశీలించారు. తుపాన్ కారణంగా నష్టపోయిన ప్రతి రైతుకు రూ.25,000 నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని.. ఆయన కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తడిసిన ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధరకే రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా తెదేపా పార్లమెంట్ ఆధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి