గుంటూరు జిల్లా తెనాలి ఇస్లాంపేటలో ఉన్న మర్ఖజ్ మసీద్‌కు మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ లక్ష రూపాయలు విరాళం అందించారు. పట్టణ తెదేపా మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ ఖుద్దుస్ ద్వారా ముస్లిం మత పెద్దకు ఈ మొత్తాన్ని అందజేశారు. 2009 నుంచి ఏటా రంజాన్ పర్వదినాన విరాళం ఇవ్వటం ఆనవాయితీగా వస్తోందని చెప్పారు. ముస్లిం కుటుంబాలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. అల్లా దయవల్ల.. కరోనా మహమ్మారి అంతం కావాలని వేడుకుంటున్నట్లు ఆలపాటి వివరించారు.
ఇదీ చదవండి: కరోనా ఆంక్షలు నడుమ.. గుంటూరులో రంజాన్ వేడుకలు