ETV Bharat / state

డీజీపీగా ఎదిగి.. స్ఫూర్తిని పంచి..!

అమెరికాలో గుండెపోటుతో మృతి చెందిన మాజీ డీజీపీ ప్రసాదరావు ఆయన గుంటూరు జిల్లా తేలప్రోలు బిడ్డే. చెన్నై ఐఐటీలో ఎంఎస్సీ ఫిజిక్స్ చదివి.. తరువాత ఐపీస్ సాధించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ డీజీపీగా విధులు నిర్వర్తించారు. ఆయన భౌతికకాయాన్ని రాష్ట్రానికి తీసుకొచ్చేలా బంధువులు ఏర్పాటుచేస్తున్నారు. ఆయన స్వస్థలం గుంటూరు జిల్లా తేలప్రోలు గ్రామం. ఆయన మతిపట్ల రచయిత షేక్ అబ్దుల్ హకీంజాని సంతాపం వ్యక్తం చేశారు

author img

By

Published : May 11, 2021, 7:27 PM IST

Updated : May 11, 2021, 7:56 PM IST

former dgp
రచయితకు జ్ఞాపికను అందిస్తున్న మాజీ డీజీపీ

అమెరికాలో గుండెపోటుకు గురై మృతిచెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ బి.ప్రసాదరావుకు... గుంటూరు జిల్లాతో అనుబంధం ఉంది. ఆయన మేనమామ, తెనాలి వాసి వి.ఎలీషా.. ఈ వివరాలను పంచుకున్నారు. శ్రీనివాసరావు, సుశీలమ్మ దంపతుల కుమారుడైన ప్రసాదరావు.. తెనాలి మండలం తేలప్రోలు గ్రామంలో జన్మించారు. వీరి ఐదుగురు సంతానంలో ఈయన తొలి బిడ్ఢ. తండ్రి శ్రీనివాసరావుది ఏలూరు ప్రాంతంలోని శనివారపుపేట. తల్లి సుశీలమ్మది తేలప్రోలు. శ్రీనివాసరావు.. పోలీసు కానిస్టేబుల్‌గా తెనాలి, నరసరావుపేట, గుంటూరు, కొల్లూరు ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. తండ్రి పనిచేసిన ప్రాంతాల్లో ప్రసాదరావు ప్రాథమిక విద్యాభ్యాసం నడిచింది.

ఇంటర్‌, డిగ్రీలను విజయవాడ లయోలా కళాశాలలో చదివిన ఆయన ఎంఎస్సీ (ఫిజిక్స్‌)ని ఐఐటీ చెన్నైలో పూర్తిచేశారు. 1979లో ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో ఏలూరు, కర్నూలు డీఐజీగా, విశాఖ, హైదరాబాద్‌ సిటీ కమిషనర్‌గా ఏసీబీ డీజీగా, ఆర్టీసీ ఎండీగా విధులు నిర్వర్తించి, తుదిగా రాష్ట్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ 2015లో ఉద్యోగ విరమణ చేశారు. ఆయనకు తెనాలిలో సొంత ఇల్లు ఉంది. ఉద్యోగ విరమణ తర్వాత హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆఫీసర్స్‌ కాలనీలో తన స్వగృహంలో ప్రసాదరావు దంపతులు నివసించారు. వీరి కుమారుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు. మనవడిని చూడడానికి ఈ ఏడాది మార్చి 24న ఈ దంపతులు అమెరికా వెళ్లారు.

ఈనెల 18న జరిగే మనవడి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొని వీరు తిరిగి రావాల్సి ఉంది. అయితే ఇంతలోనే ప్రసాదరావుకు ఆదివారం గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. ఆయన భౌతిక కాయాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి బంధువులు ప్రయత్నిస్తున్నారు.

గత ఏడాది తెనాలికి:

ప్రసాదరావు గత ఏడాది కుటుంబ వేడుకలో పాల్గొనడానికి తెనాలి వచ్చారు. ఆర్టీసీ ఎండీగా ఉన్న సమయం(2010)లో తెనాలి పురపాలక సంఘ శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డీజీపీగా ఉన్న కాలం(2013)లో తెనాలికి చెందిన రచయిత, బాల సాహితీవేత్త షేక్‌ అబ్దుల్‌ హకీంజాని పేరు ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సు’లో నమోదైన సందర్భంగా ఆ జ్ఞాపికలను ప్రసాదరావు రచయితకు అందించారు. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్న హకీంజాని ఆయన మృతికి సంతాపం తెలిపారు.

కొల్లూరును దత్తత తీసుకొని..

మాజీ డీజీపీ ప్రసాదరావు గుంటూరు జిల్లా కొల్లూరు జడ్పీ బడిలో ఆరు నుంచి పదో తరగతి వరకూ చదువుకున్నారు. స్థానికంగా ఉన్న బంధువుల ఇంటిలో ఆశ్రయం పొందిన ఆయన 1969-70లో ఇక్కడ పదో తరగతి చదివి, జిల్లాలో ప్రథముడిగా నిలిచారు. ఆ స్మృతులను మరువని ఆయన డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో కొల్లూరును దత్తత తీసుకుని పలు కార్యక్రమాలు నిర్వహించారు. అనేక సార్లు ఆయన తమ గ్రామాన్ని సందర్శించిన విషయాన్ని స్థానికంగా ఉన్న ఆయన బంధుమిత్రులు, స్థానికులు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

ఇదీ చూడండి:

కరోనాతో జస్టిస్ జాస్తి సత్యనారాయణ మూర్తి మృతి

Last Updated : May 11, 2021, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.