Loan With Forged Documents: నకిలీ ఆధార్ కార్డులు, పట్టాదారు పాసుపుస్తకాలు సృష్టించి రూ. లక్షల రుణాలు పొందిన ఘటన గుంటూరు జిల్లా కాకుమాను ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో జరిగింది. స్థానికంగా ఉంటున్నట్లు పలువురి నకిలీ పత్రాలు సృష్టించి రూ. 76 లక్షలు నగదు స్వాహా చేశారు.11 మంది వ్యక్తులు స్థానికంగా ఉంటున్నట్లు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారు. మాచవరం మండలంలో పొలం ఉన్నట్లు పట్టాదారు పాసుపుస్తకాలు తీసుకొచ్చి రూ. 76 లక్షలు రుణాలు తీసుకున్నారు. సదరు వ్యక్తులు మనకు తెలిసిన వారే అని సొసైటీ ఛైర్మన్ తనపై ఒత్తిడి చేసి మరి రుణాలు ఇప్పించారని సెక్రెటరీ శ్రీనివాసరావు చెప్పారు.
ఇటీవల ప్రత్తిపాడు సొసైటీలో అక్రమాల విషయం బయటకురావడంతో అనుమానం వచ్చిన సెక్రెటరీ.. ఈ 11 మంది వ్యక్తుల పాసుపుస్తకాల గురించి మాచవరం ఎమ్మార్వో కార్యాలయంలో ఆరా తీశారు. అవి నకిలివి చెప్పారని.. కాకుమాను మండలంలో ఉంటున్నట్లు నకిలీ ఆధార్ కార్డులు సృష్టించారని సెక్రెటరీ చెప్పారు. సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి