ETV Bharat / state

నీరు తగ్గింది.. నష్టం మిగిలింది - ఏపీలో భారీ వర్షాలు న్యూస్

వరదలు, భారీ వర్షాలతో గత మూడు రోజుల నుంచి జలదిగ్బంధంలో చిక్కుకున్న కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ఆదివారం నీటి ఉద్ధృతి స్వల్పంగా తగ్గుముఖం పట్టడంతో పంట నష్టం తేలుతోంది. వరదనీటి వల్ల ఎండిపోయిన పంటలతో కన్పిస్తున్న చేలు కొన్నయితే ఇంకా ముంపులోనే ఉన్న పొలాలు మరికొన్ని. వెరసి అన్నదాతల మనసు కకావికలం అవుతోంది. తాము ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎందుకూ పనికిరాకుండా కన్పిస్తున్నాయి.

నీరు తగ్గింది.. నష్టం మిగిలింది
నీరు తగ్గింది.. నష్టం మిగిలింది
author img

By

Published : Oct 19, 2020, 1:24 PM IST

కొల్లూరు, కొల్లిపర, భట్టిప్రోలు, దుగ్గిరాల, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని వరి, మినుము, అరటి, పసుపు, మిర్చి, కంద, బొప్పాయి, తమలపాకు, కూరగాయల పంటలు కుళ్లిపోయి దర్శనమిస్తున్నాయి. నీళ్లు బయటకు వెళుతుండడంతో పడవ ప్రయాణాలు తగ్గాయి. గడిచిన రెండు రోజుల నుంచి ముంపులో ఉన్న కొల్లిపర మండలం బొమ్మువానిపాలెం, కొల్లూరు మండలం ఆవులవారిపాలెం, గాజుల్లంక, పెసరలంక, పెదలంక, భట్టిప్రోలు మండలం పెసరలంక, ఓలేరు, వెల్లటూరు గ్రామాల నుంచి రాకపోకలు మొదలయ్యాయి. చాలా చోట్ల రహదారులు దెబ్బతిన్నాయి. వరదలతో నీళ్లు కలుషితమయ్యాయి. కొన్ని రోజుల పాటు ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తేనే మేలని, కుళాయిల నుంచి వచ్చే నీరు తాగటం అంత శ్రేయస్కరం కాదని వైద్యులు సూచిస్తున్నారు.

తెనాలి డివిజన్‌లో భారీగా దెబ్బతిన్న పంటలు

తెనాలి డివిజన్‌ పరిధిలో బాగా నష్టం వాటిల్లింది. ఈ ప్రాంతాల్లో తక్షణమే పంటలు, ఇతరత్రా నష్టం అంచనా వేయటానికి జిల్లా యంత్రాంగం సమాయత్తం కావాలని జిల్లా పాలనాధికారి శామ్యూల్‌ ఆనందకుమార్‌ ఆదేశించారు. ఆదివారం ఆయన కొల్లూరులో జేసీలు దినేష్‌కుమార్‌, ప్రశాంతి, ఆయా శాఖల విభాగాధిపతులతో సమీక్ష చేశారు. తెనాలి డివిజన్‌ పరిధిలో 10 వేల ఎకరాల్లో ఎకరాల్లో, గుంటూరు డివిజన్‌ పరిధిలో మరో నాలుగు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా గుర్తించారు. ఆదివారం ఉదయం ఎగువ ప్రాంతాల నుంచి 6 లక్షల క్యూసెక్కుల వరదనీరు కృష్ణానదిలోకి రావడంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్య్సకారులు వేటకు వెళ్లరాదని ఆదేశించారు. కృష్ణానదిలోకి వచ్చి, పోయే మార్గాల్లో పోలీసు పికెట్లు మరికొన్ని రోజులు కొనసాగించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం నిర్ణయించింది. నదిలో వరదనీరు ఎక్కువగా ఉన్నందున పిల్లలు సరదాగా ఈతకు వెళ్లడం, నదీ ప్రాంతాన్ని చూడడానికి వెళ్లడం వంటివి పూర్తిగా నిషేధించారు. ప్రతి గ్రామంలో కార్యదర్శులు, గ్రామ వాలంటీర్లు నదీ ప్రాంతానికి వెళ్లే మార్గాలపై నిఘా పెట్టాలని జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.

విద్యుత్తు శాఖకు వరద షాక్‌

వర్షాలు, వరదలతో జిల్లాలో విద్యుత్తు శాఖకు సుమారు రూ.23.9 లక్షల వరకు నష్టం ఏర్పడినట్లు ప్రాథమిక అంచనా. కొల్లూరు, కొల్లిపర, భట్టిప్రోలు మండలాల పరిధిలోని లంక గ్రామాల్లో స్తంభాలు, నియంత్రికలు, కండక్టర్‌, కేబుల్‌ వైర్లు ఎక్కడికక్కడే దెబ్బతిన్నాయి. 838 నియంత్రికలు, 295 స్తంభాలు వరదల్లో చిక్కుకున్నాయి.ముంపు గ్రామాల్లో విద్యుత్తు పునరుద్ధరణకు సిబ్బంది కృషి చేస్తున్నారు. ట్రాన్స్‌కో ఎస్‌ఈ విజయ్‌ కుమార్‌ ఎప్పటికప్పుడు పనులపై సమీక్షిస్తున్నారు.

దుంప ఎదగకుండానే...

కృష్ణానది వరద తెచ్చిన నష్టం అంతా ఇంతా కాదు. కొల్లిపర మండలం అత్తలూరివారిపాలెం గ్రామానికి చెందిన రైతు గొడవర్రులో రెండున్నర ఎకరాలు కంద వేశారు. వరదనీటికి కంద మునిగింది. ఆ చేలో శనివారం నీరు తగ్గింది. చేను ఆరేదాక ఉంచితే దుంప కుళ్లిపోతుందనే ఉద్దేశంతో ఆదివారం తవ్వేశారు. దుంప సాంతం ఎదగలేదు. దీంతో 100 పుట్లు అవ్వాల్సిన దిగుబడి 40 పుట్లు (పుట్టు 225 కిలోలు) మాత్రమే అయింది.

కౌలుతో కలిపి రూ.2 లక్షలు నష్టం

ఇప్పటికి రెండుసార్లు పంటనష్టం జరిగింది. కౌలుకు ఎకరం రూ.45 వేలకు తీసుకుని సొర, మినుము 1.80 ఎకరాల్లో పంట వేశాను. గత ఏడాది వరద కారణంగా కౌలుతో కలుపుకుని రూ.2 లక్షలు, ఈఏడాది రెండుసార్లు వచ్చిన వరదకి రూ.2 లక్షలు నష్టం జరిగింది. పంటలు బాగుంటే రూ.6 లక్షలు ఆదాయం వచ్చేది. పూర్తిగా తుడిచి పెట్టుకుపోయాయి. కనీసం పెట్టుబడి ఇచ్చినా తేరుకుంటాను.

- దేవిశెట్టి శివన్నారాయణ, కౌలురైతు, చిర్రావూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.