ETV Bharat / state

విమర్శలకు దారి తీసిన ఫ్లెక్సీ

సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పలు విమర్శలకు దారి తీసింది. ఫ్లెక్సీపై ఓ షాపింగ్ సంస్థ పేరు, లోగో ఉండటంతో స్థానికులు అభ్యంతరం తెలిపారు. ఫలితంగా ఆ ఫ్లెక్సీని తొలగించి మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.

Flexi led to criticism in Siripuram, Guntur district
విమర్శలకు దారి తీసిన ఫ్లెక్సీ
author img

By

Published : Jan 11, 2021, 1:47 AM IST

గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం సిరిపురం గ్రామంలో మూడు రోజుల క్రితం ఒక ఫ్లెక్సీ కట్టారు. గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీపై మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హోం శాఖ మంత్రి మేకతోటి సూచరిత ఫోటోలు ఉన్నాయి. కింద భాగాన ఓ ప్రముఖ షాపింగ్ సంస్థ పేరు, లోగో ఉంది. గమనించిన స్థానికులు ఈ అంశాన్ని షాపింగ్ సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో తమ లోగో ఉన్న ఫ్లెక్సీని తొలగించి, షాపింగ్ సంస్థ వారు మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. స్థానికంగా ఉండే వైకాపా కార్యకర్త ఒకరు ఈ ఫ్లెక్సీ ఏర్పాటు చేశాడని, పొరపాటుగా షాపింగ్ సంస్థ లోగో వచ్చిందని పోలీసులు తెలిపారు.

ఇదీచదవండి.

అక్క అరెస్టు వెనుక పెద్ద రాజకీయ కుట్ర: భూమా నాగ మౌనిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.