Flexi Dispute: గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది దుండగులు జెండా చెట్టు కూడలిలోనున్న తెలుగుదేశం బ్యానర్లు చించేసి.. ఎన్టీఆర్ విగ్రహానికి వైకాపా జెండా కట్టడంతో.. తెలుగుదేశం శ్రేణులు ఆందోళన చేశారు. గతంలో ఇలాంటి ఘటనలు జరిగినా.. పోలీసులు ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. ఈ చర్యలకు కారణం వైకాపా వర్గీయులే అంటూ నినదిస్తూ.. నిరసన చేశారు.
పోలీసులు తెలుగుదేశం శ్రేణులతో మాట్లాడినా వారు పట్టువీడలేదు. చివరకు పోలీసుల జాగీలాలను తెప్పించి విచారణ జరిపారు. అయినా నిందితులను కనిపెట్టలేదు. గ్రామస్థుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి: Insulting judges Case: జడ్జిలను దూషించిన కేసులో ఏపీ అసెంబ్లీ స్టాండింగ్ కౌన్సెల్ చంద్రశేఖర్ అరెస్ట్