గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఒకే రోజు ఐదుగురు వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారంతా 4వ వార్డులో పని చేసేవారు. ఈ ప్రాంతంలో ఇటీవల కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఆ ప్రాంతాన్ని కంటెన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఇలాంటి పరిస్థితుల్లో సౌకర్యాల కల్పన విషయంలో వాలంటీర్లపై స్థానికుల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో విషయాన్ని వార్డు సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు స్పందించలేదు. ప్రజల సమస్యలను సచివాలయ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోకపోవటం వాలంటీర్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావును కలసి విషయం తెలిపారు. అలాగే మహిళా వాలంటీర్లకు రాత్రి పూట విధులు వేయవద్దని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ నుంచి కూడా సానుకూల స్పందన రాకపోవడం రాజీనామా చేసిన్నట్లు ఐదుగురు వార్డు వాలంటీర్లు తెలిపారు.
ఇవీ చూడండి...: పనిచేయని సర్వర్లు.. పన్ను చెల్లింపుదారులకు తప్పని తిప్పలు