రోడ్డు ప్రమాదంలో అయిదుగురికి గాయాలు - గుంటూరు జిల్లా రోడ్డు ప్రమాదాలు
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం వేమవరం వద్ద ప్రమాదం జరిగింది. కారు టైరు పంక్చరై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న అయిదుగురికి గాయాలయ్యాయి. బాధితులను ములకలూరుకు చెందినవారిగా గుర్తించారు. స్థానికులు ప్రమాదాన్ని గమనించి బాధితులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.