గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని ఇంజనీరింగ్ కళాశాలలో గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 5కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు బాపట్ల డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. డీవీసీ కాలనీకి చెందిన వెంకట సాయి.. నక్కల రవి కుమార్ అనే లారీడ్రైవర్ సహాయంతో.. విశాఖపట్నం నుంచి గంజాయిని తీసుకొచ్చినట్లు విచారణలో తేలిందన్నారు. వేణుకుమార్, గోపి మరో ముగ్గురు వ్యక్తులతో కలిసి చిన్న చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి.. వట్టిచెరుకూరు మండలంలోని కిట్స్ ఇంజనీరింగ్ కాలేజ్, నంబూరు వీవీఐటీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు అమ్ముతున్నట్లు గుర్తించామన్నారు. వీరితో పాటుగా మాదక ద్రవ్యాలకు బానిసలైన యువకులు, ఆటో డ్రైవర్లకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి అసాంఘిక సంఘటనలు గుర్తించినట్లయితే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.
ఇవీ చూడండి...: మాచర్ల పురపాలక సంఘం ఛైర్మన్గా తురక కిషోర్