గుంటూరు సీఐడీ కార్యాలయంలో స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది. ఏసీ మెయిన్ వద్ద షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపు చేశారు. గత కొన్ని రోజులుగా ఆ గదిని తెరవకపోవడం, ఒక్కసారిగా ఏసీ అన్ చేయడం వల్ల మంటలు చెలరేగాయని సీఐడీ అధికారులు చెప్పారు. ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీచదవండి.