గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో వినాయక నిమజ్జన కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. పార్వతీపురం కాలనీలో వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు కట్టి, డీజే డప్పులతో ఊరేగింపు చేపట్టారు.
నిన్న తెదేపా శ్రేణుల గణేశ్ విగ్రహ నిమజ్జన వేడుకల్లో.. డీజే, డప్పులతో ఊరేగింపునకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. నిన్న తమను అడ్డుకుని.. ఇవాళ వైకాపా శ్రేణులకు అనుమతివ్వడంపై వివాదం చెలరేగింది. తమకు అనుమతి ఎందుకు నిరాకరించారంటూ.. పోలీసులను తెదేపా కార్యకర్త అడుగుతుండగా వైకాపా కార్యకర్తలు దాడికి దిగారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడే ఉన్న పోలీసులు ఇరువర్గాలను నియంత్రిస్తున్నారు.
ఇదీ చదవండి: