పంట సాగుకు రుణాలు ఇవ్వాలని కోరుతూ రైతులు నిరసన తెలిపారు. గుంటూరు జిల్లా మేడికొండూరు యూనియన్ బ్యాంక్ వద్ద కౌలుదారుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం నెలలు గడుస్తున్నా ఇంతవరకు బ్యాంకు రుణాలు ఇవ్వలేదని కౌలుదారుల సంఘం నాయకులు రాధాకృష్ణ ఆరోపించారు. రైతులకు అప్పు ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన బ్యాంకులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఆర్సీ కార్డులు, ఈ క్రాఫ్ట్ బుకింగ్... కారణాలు చెబుతూ బ్యాంకులో రుణాలు ఇవ్వట్లేదన్నారు. దీని వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. తక్షణమే సంబంధిత అధికారులు స్పందించి కౌలు రైతులకు రుణాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు .
ఇదీ చదవండీ...ఆధార్ కార్డు అనుసంధానం కోసం వృద్ధుల అగచాట్లు