లాక్డౌన్, అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకుంటామంటూ హామీలిస్తున్నా... అవి క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదన్నారు. వలస కార్మికులను స్వస్థలాలకు తరలించడంలో ప్రభుత్వం మంచి చొరవ చూపిందన్న నాగేశ్వరరావు... కరోనా వైరస్ విపత్తుకు సంబంధించి వాస్తవ పరిస్థితులను చెప్పడంలో మాత్రం విఫలమైందన్నారు.
ఇవీ చదవండి: రేపు.. రాష్ట్రవ్యాప్తంగా 58 లక్షల మందికి పింఛన్లు