మామిడి రైతుపై ప్రకృతి కన్నెర్ర చేసింది. ఈదురు గాలులకు మామిడి రైతు నష్టాల పాలయ్యాడు. గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం మెడికొండ్రు మండలం పేరేచర్ల పరిధిలో ఈదురు గాలులతో వర్షం కురిసింది.
గాలుల ధాటికి మామిడి కాయలు నేలరాలాయి. ఎకరాకు 10 నుంచి 15 వేల వరకు నష్టం వస్తోందని రైతులు చెప్పారు. లాక్డౌన్ కారణంగా లాభాలు లేక అల్లాడుతుంటే, ఈదురు గాలులతో నష్టం మరింత పెరిగిందని ఆవేదన చెందారు.
ఇవీ చూడండి: