ETV Bharat / state

పోలీస్​స్టేషన్​కు తరలించారని యువరైతు ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Mar 27, 2021, 7:36 PM IST

గుంటూరు జిల్లా వినుకొండ విష్ణుకుండి నగర్​లో విషాదం నెలకొంది. ఓ యువరైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎన్​ఎస్పీ కాలువ లీకవుతుండటంతో.. వీరాంజనేయులు అనే రైతు తన చేనులోకి ఆ నీటిని మరల్చుకున్నాడు. మున్సిపల్ సిబ్బంది వచ్చి లీకేజిని పూడ్చమని చెప్పటంతో.. రైతు దాన్ని పూడ్చివేశాడు. అయినా.. మున్సిపల్ సిబ్బంది అతడిని పోలీస్ స్టేషన్​కు తరలించేలా చేశారు. దీంతో మనస్థాపానికి గురైన యువరైతు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

farmer, suicide
యువరైతు, ఆత్మహత్యాయత్నం

గుంటూరు జిల్లా వినుకొండలో విషాదం నెలకొంది. విష్ణుకుండి నగర్​కు చెందిన ఎర్రబోతు వీరాంజనేయులు అనే యువ రైతు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఎన్​ఎస్పీ కాలువ నుంచి వస్తున్న లీకేజీ నీటిని తన చేనులోకి మరల్చుతుండగా.. మున్సిపల్ సిబ్బంది వచ్చి లీకేజీని పూడ్చమని హెచ్చరించారు. వీరాంజనేయులు లీకేజిని పూడ్చుతుండగా.. పోటోలు తీసి కమిషనర్​కు తెలిపారు.

కమీషనర్ పోలీసులుకు సమాచారం ఇవ్వగా.. వారు అక్కడకు చేరుకుని వీరాంజనేయులును అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. దీంతో మనస్థాపానికి గురైన రైతు.. తన పొలంలో ఎడ్లు ఉన్నాయని వాటిని ఇంటి వద్ద వదిలేస్తారని స్టేషన్​లో తెలిపి.. పొలానికి వచ్చి పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదీ చదవండి:

మహిళపై కత్తితో దాడి చేసిన కానిస్టేబుల్... పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.