ముడి చమురు ధరలు పెంచడం ద్వారా సామాన్యులపై పెను భారం పడిందని.. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులకు 2.35 లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్.. నిరుద్యోగులను మోసం చేశారని అన్నారు. ఉద్యోగాలు కల్పించాలని ప్రజాస్వామ్య పద్ధతిలో వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన నిరుద్యోగులను అక్రమంగా అరెస్టులు చేయడం దారుణం అన్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో అయినా రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి రాజధానిపై కనువిప్పు కలగాలన్నారు.
మద్యం, పేకాటకు కేంద్రంగా మారిన చిలకలూరిపేటలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉపేక్షిస్తోందని విమర్శించారు. యడవల్లి దళిత, గిరిజన వీకర్ సొసైటీ భూములపై స్థానిక వైకాపా ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయం ఏమిటో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై బురద జల్లి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన నేతలు.. ఇప్పడు యడవల్లి భూములపై ఏం చేస్తున్నారో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
ఇదీ చదవండి..
javahar: 'పేదల కన్నీటి ప్రవాహంలో.. వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోతుంది'