గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం మాదినపాడు గ్రామం యం.పి.ఈ.ఓ దివ్యపై షేక్ మస్తాన్ అనే రైతు దాడి చేశాడు. దివ్య రైతు భరోసా పథకం కోసం రైతుల నుండి వివరాలు సేకరిస్తుండగా... షేక్ మస్తాన్ తన కూతురి పేరు కూడా పథకంలో నమోదు చేయాలని కోరారు. అయితే కుటుంబంలో ఒక్కరు మాత్రమే అర్హులు అని చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రైతు ఆమెపై చేసుకున్నారని...దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని వ్యవసాయ అధికారిణి సంధ్యారాణి తెలిపారు. రైతుపై స్థానిక పోలీస్ స్టేషన్, ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు...ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యులు తీసుకోవాలని ఆమె కోరారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రజలకు వాల్మీకి జయంతి శుభాకాంక్షలు: సీఎం జగన్