రాజధాని తరలిపోతుందనే బెంగతో రైతు మృతి - అమరావతి రైతుల నిరసన వార్తలు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో అద్దేపల్లి కృపానందం అనే రైతు మృతి చెందాడు. గత పది రోజులుగా కృష్ణాయపాలెంలో జరుగుతున్న రైతుల ఆందోళనలో ఆయన పాల్గొన్నాడు. రాజధాని తరలిపోతుందనే బెంగతో గత రెండు రోజులుగా ఆందోళన చెందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం తమకు ఉన్న అర ఎకరం పొలం ఇచ్చామని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పుడు రాజధాని తరలిపోతే తమ భవిష్యత్ అంధకారం అవుతుందనే ఆందోళనతో గుండెపోటుకు గురై... తన తండ్రి మృతి చెందాడని ఆయన కుమారుడు బుల్లిబాబు చెప్పాడు.
(. ) అమరావతి ఆందోళనలో మరో రైతు మృతి చెందాడు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయ పాలెం గ్రామానికి చెందిన అద్దేపల్లి కృపానందం బుధవారం ఉదయం మృతి చెందాడు. గత పది రోజులుగా గా కృష్ణాయ పాలెం లో జరుగుతున్న రైతుల ఆందోళన లో కృపానందం పాల్గొన్నాడు. రాజధాని తరలి పోతుందనే బెంగతో గత రెండు రోజులుగా ఆందోళన చెందుతున్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం తమకు ఉన్న అరెకరం పొలం భూ సమీకరణ ఇచ్చామని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇప్పుడు రాజధాని తరలిపోతే తమ భవిష్యత్ అంధకారం అవుతుందనే ఆందోళనతో గుండెపోటుకు గురై కృపానందం మృతిచెందాడని ఆయన కుమారుడు బుల్లి బాబు చెప్పాడు.