ETV Bharat / state

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య - guntur district crime

గుంటూరు జిల్లా పెదకొండూరులో విషాదం నెలకొంది. అప్పుల బాధ తాళలేక కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
author img

By

Published : Sep 10, 2021, 7:12 PM IST

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం పెదకొండూరు గ్రామానికి చెందిన కొండూరు ఫ్రాన్సిస్.... వ్యవసాయ భూమిని కౌలుకు తీసుకుని సేద్యం చేస్తున్నాడు. దీని కోసం రూ.ఐదు లక్షలు అప్పు చేశాడు. ఈ సమయంలో ఫ్రాన్సిస్ అనారోగ్యానికి గురయ్యాడు. ఈ పరిణామాలతో అప్పు తీరుస్తాడో, లేదోనన్న భావనతో అప్పు ఇచ్చిన వారు డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫ్రాన్సిస్ పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీచదవండి.

Gang Rape: గుంటూరు సామూహిక అత్యాచార ఘటనలో ఆ వార్తలు అవాస్తవం: డీఐజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.