కుల్ భూషణ్ జాదవ్ కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై తెదేపా అధినేత చంద్రబాబు, నారా లోకేశ్ ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కుల్ భూషణ్ ని స్వదేశానికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలని చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. ఈ తీర్పు అంతర్జాతీయ న్యాయస్థానంలో భారత్‌కు గొప్ప విజయమని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అభివర్ణించారు. ఆయన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షాలు తెలిపారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా చివరికి న్యాయమే గెలిచిందన్నారు.
ఇదీ చదవండి : జాదవ్ మరణశిక్షపై పున:సమీక్షించాల్సిందే: ఐసీజే