గుంటూరు డీఈవో కార్యాలయం ఎదుట ఫ్యాప్టో సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. అక్రమ బదిలీలు పైన విచారణ జరిపి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డీఈవోను కలసి వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలను తక్షణమే రద్దు చేసి.. బదిలీల షెడ్యూల్ విడుదల చేయాలని ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ బసవలింగరావు డిమాండ్ చేశారు. బదిలీల్లో జరిగిన అవినీతిపై విచారణ జరపాలన్న వారు... జీవో నెంబర్ 342ను యధావిధిగా కొనసాగించాలన్నారు. ఎస్సీ, ఎస్టీ ఉపాద్యాయులకు స్టడీ లీవ్‌ను నిరకరించే మోమో 820, 339లను రద్దు చేయాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించకపోతే పెద్దఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఇవీ చూడండి...