గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం మద్దిరాలలోని సాధినేని చౌదరయ్య ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల, అగ్రి పాలిటెక్నిక్ కళాశాలల ప్రిన్సిపాల్ డాక్టర్ పొట్లూరి కేశవరావు(74) గుండెపోటుతో మరణించారు. 4 రోజుల క్రితం గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిన ఆయన సోమవారం చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
విశ్రాంత జీవితంలో విద్యాభివృద్ధికి కృషి..
డాక్టర్ పొట్లూరి కేశవరావు స్వగ్రామం కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు. అక్కడే ఏ.జి అండ్ ఎస్.జి కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన.. పదవి విరమణ అనంతరం సాధినేని చౌదరయ్య కళాశాల ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టారు. విశ్రాంత వయసులోనూ కళాశాల ప్రిన్సిపాల్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. చిలకలూరిపేట ప్రాంతంలో అగ్రి పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు ఆయన కృషి చేశారు. కేశవరావు మృతికి ధనలక్ష్మి గ్రూప్ సంస్థ యాజమాన్యం, కళాశాల పాలకవర్గం ఎండీ నన్నపనేని రాఘవరావు, డైరెక్టర్లు పేర్ని వీర నారాయణ, సాధినేని హనుమంతరావులు సంతాపం వ్యక్తం చేశారు. విశ్రాంత జీవితంలోనూ విద్యాభివృద్ధికి ఆయన కృషి చేశారని వారు కొనియాడారు.
ఇదీ చదవండి:
కొత్తపల్లి గ్రామంలో విషాదం.. కృష్ణా నదిలో విద్యార్థి గల్లంతు