"1984లో మా తాతా ఈ స్థలం కొన్నాడు. మా నాయనమ్మ చనిపోయిన తర్వాత స్థలం ఎలా ఉందో చూసి పోదాం అని వస్తే ప్లాటులో కంకర ఉంది. ఎందుకు మా స్థలంలో కంకర వేశారని అడిగితే ఈ ప్లాటు సంవత్సవరం క్రితం కొందరు ముస్లింలు మాకు అమ్మేశారని చెప్పారు. మా తాతయ్య చనిపోయింది 1999. రిజిస్ట్రేషన్ జరిగింది 2021లో. మా తాత ఎలా స్థలం అమ్మాడని ఆశ్చర్యం కలిగింది. చనిపోయిన వ్యక్తికి ఆధార్ కార్డు సృష్టించి కబ్జారాయుళ్లు మా స్థలాన్ని కబ్జా చేశారు. మాకు న్యాయం జరగాలి. ఈ దారుణాన్ని మేము కోర్టులోనే తేల్చుకుంటాం."- బాధితుడు
ఇవీ చదవండి: